- చెప్పినమాట వింటే మేడిగడ్డ కుంగేది కాదు
- కాళేశ్వరం కమిషన్ ఎదుట ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): మేడిగడ్డ ఆనకట్ట లోపాలపై తాము ప్రభుత్వానికి చెప్పామని, తాము చెప్పినప్పుడే లోపాలను సరిచేసి ఉంటే మేడిగడ్డ కుంగేది కాదని ఆ ప్రాజెక్టు కట్టిన ఎల్‌అండ్‌టీ సంస్థ పేర్కొంది. శుక్రవారం కాళేశ్వరం కమిషన్ ఎదుట ఎల్‌అండ్‌టీ ప్రాజెక్టు డైరెక్టర్ రామకృష్ణ రాజు, వైస్ చైర్మన్ సురేష్, రజినీష్ విచారణకు హాజరయ్యారు.
నీరు నిల్వ చేసిన తర్వాత మొదటి సీజన్‌లోనే మేడిగడ్డ ఆనకట్టలో సమస్యలు తలెత్తాయని ఆ సంస్థ ప్రతినిధులు కమిషన్‌కు తెలిపారు. సమస్యలు పరిష్కరించేందుకు తగిన డిజైన్స్ ఇవ్వాలని నీటిపారుదల శాఖ ను కోరామని, ఆ విషయంలో నాలుగేళ్లు అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందనే రాలేద న్నారు. 2019లోనే లోపాలను పరిష్కరించి ఉంటే మేడిగడ్డ ఆనకట్టకు ఇంత ప్రమా దం వాటిల్లేది కాదని చెప్పారు.
ప్రారం భం నుంచి కుంగే వరకు ఆనకట్ట ఎప్పుడూ ఖాళీగా లేదని పేర్కొన్నారు. ప్రాజె క్టు నిర్మాణం, నాణ్యత, 7వ బ్లాక్ కుంగుబాటు పై కమిషన్ ప్రశ్నించగా.. ఎల్‌అండ్‌టి ప్రతినిధులు ముఖ్యమైన విషయాలను తెలిపారు. సమస్యలు కొనసాగుతూనే వచ్చి ఆ ప్రభావం ఏడో బ్లాక్‌పై పడి ఉండవచ్చని సంస్థ ప్రతినిధు లు చెప్పారు.
నిర్మాణంలో నాణ్యతపై కమిషన్ ప్రశ్నించగా.. వంద శాతం క్వాలిటీ నిర్మాణం చేపట్టినట్లు వారు సమాధానమిచ్చారు. మొద ట ఇరిగేషన్ శాఖ ఇచ్చిన డిజైన్స్, డ్రాయింగ్స్ ప్రకారమే మేడిగడ్డ ఆనకట్ట నిర్మించామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. డిజైన్‌లో అంచనా వేసిన ప్రవాహ వేగం కంటే ఎక్కువగా ఉన్నందువల్లనే ఆనకట్ట దిగువన అప్రాన్, సీసీ బ్లాకులు దెబ్బతిన్నాయని.. ఫలితంగానే ప్రాజె క్టు బ్లాకులు కుంగినట్లు ఎల్‌అండ్‌టి ప్రతినిధులు తెలిపారు.
మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో ఎలాంటి సబ్ కాంట్రాక్టులు ఇవ్వలేదన్నారు. కాఫర్ డ్యామ్‌కి సంబంధించి తమకు ప్రభు త్వం నుంచి ఎక్స్‌ట్రా పేమెంట్ ఏమీ రాలేదన్నారు. ఆనకట్ట పూర్తి అయినట్లు ధ్రువీకరణ పత్రం కూడా ఇచ్చారని.. డిఫెక్ట్ లయబిలిటీ గడువు కూడా పూర్తి అయ్యిందన్నారు.