calender_icon.png 11 March, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ పరీక్షలో తప్పిదం!

11-03-2025 12:00:00 AM

  1. సెకండియర్ ఇంగ్లిష్ ప్రశ్నపత్రంలో ముద్రణాలోపం
  2. అస్పష్టంగా నాలుగు మార్కుల ప్రశ్న
  3. అధికారులకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు
  4. మార్కులు కలుపుతామని ఇంటర్ బోర్డు వెల్లడి

హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణలో తప్పిదాలు వెలుగుచూస్తున్నాయి. సోమవారం నిర్వహిం చిన ఇంటర్ సెకండియర్ ప్రశ్నపత్రంలో ఓ ప్రశ్నను అస్పష్టంగా ఇ చ్చారు. సెక్షన్ -బీలో 7వ ప్రశ్నగా చార్ట్‌ను ఇచ్చారు. అయితే ముద్రణాలోపం కారణంగా ఈ చార్ట్‌లో ఇచ్చి న వివరాలు విద్యార్థులకు కనిపించలేదు.

దీంతో పాటు ప్రశ్నపత్రంలో 4, 5 పేజీలను సరిగ్గా ముద్రించలే దు. మిగతా పేజీలు ఒకలా.. ఈ రెం డు పేజీలు మరోలా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. ఈ లో పం అన్ని సెంటర్లో కనిపించింది. ఈ ప్రశ్న విషయంపై అధికారుల నుంచి ఏమైనా సమాచారం వస్తుందేమోనని సెంటర్లలో విద్యార్థులు, ఇన్విజి లేటర్లు వేచిచూశారు.

కానీ, ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమా చారం అందకపోవడంతో వచ్చిన కా డికి సమాధానాలు రాయాలని ఇన్విజిలేటర్లు విద్యార్థులకు సూచిం చినట్లు తెలిసింది. అయితే అస్పష్టం గా వచ్చిన ప్రశ్న నాలుగు మార్కులది కావడంతో విద్యార్థుల్లో ఆందో ళన నెలకొన్నది.

తప్పిదం ఇంటర్‌బోర్డుది కావడంతో తమకు నాలుగు మార్కులు కలపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కొందరు విద్యార్థులు ఇదే విషయం పై లిఖితపూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేశారు. తమకు నాలుగు మార్కులు కలపాలని ఆయా వినతిపత్రంలో డిమాండ్ చేశారు. 

మార్కులు కలుపుతాం..

ఇదిలా ఉంటే సెకండియర్ ఇంగ్లి ష్ ప్రశ్నపత్రంలో 7వ ప్రశ్నలో పై చార్ట్‌కు సంబంధించిన ప్రశ్న అస్పష్టంగా ఉన్నట్లు ఇంటర్ బోర్డు దృష్టికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీనిపై సబ్జెక్టు నిపుణులు విపులంగా చర్చించి జవాబును సమాధాన పత్ర ంలో రాయడానికి ప్రయత్నించిన వారందరికీ ప్రశ్నకు కేటాయించిన మార్కులను కలుపనున్నట్లు బోర్డు ప్రకటించింది.

13వేల మంది డుమ్మా..

ఇదిలా ఉంటే సోమవారం నిర్వహించిన పరీక్షకు 13 వేలకు పైగా విద్యార్థులు డుమ్మా కొట్టారు. మొ త్తం 4,46,992 విద్యార్థులకు 4,33, 963 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 13,029 విద్యార్థులు (2.91 శాతం) పరీక్షకు గైర్హాజరయ్యారు. ఇంటర్ బోర్డు నియమించిన పరిశీలకులు నిజామాబాద్, వరంగల్, సిరి సిల్ల, కరీంనగర్, హైదరాబాద్ జిల్లా ల్లో తనిఖీలు నిర్వహించినట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య పేర్కొన్నారు.