పేద మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తున్నది ప్రభుత్వం. పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాళ వారీగా ఈ పథకం అమలుకు సంబంధించి మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భావించి మహిళా శక్తి క్యాంటీన్లను పైలెట్ ప్రాజెక్టుగా పూర్తి చేయాలనుకుంటున్నది.
ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలతో కలిసి ఈ పథకాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధమైంది. వీటి నిర్వహణ కోసం మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం తక్కువ ధరకే నాణ్యమైన భోజనం పేదవారికి అందించడం.
ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు క్యాంటీన్లు ఏర్పాటు చేయనుంది. అయితే ఇప్పటికే రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో క్యాంటీన్ ఏర్పాటుకు అన్ని సిద్ధం చేశారు. ఈ క్యాంటీన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు సరం సిద్ధం చేశారు.
ఇప్పటికే వివిధ రకాల సంక్షేమ పథకాలు సైతం మహిళల పేరిటే అమలు చేస్తున్న ప్రభుతం వారిని మరింత బలోపేతం చేసే దిశగా ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లాల్లో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఇలాంటి క్యాంటీన్లు ఉన్నా యి.
మన రాష్ర్టంలోనూ క్యాంటీన్‌లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు చేసింది. ఫలితంగా అధికారు లు వీటి ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారు. బ్యాంకర్లతో సమీక్షించిన ఉన్నతాధికారులు ఎంపిక చేసిన సయం సహాయక సంఘాలకు వారి శక్తిమేర రుణాలు ఇప్పించేలా ఆదేశాలు జారీ చేశారు. తొలి దశలో జిల్లాకు నాలుగు చొప్పున ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు.
నీతం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ..
ఆదిలాబాద్ జిల్లాలో ఈ క్యాంటీన్ల ఏర్పాటుకు ఎంపిక చేసిన సయం సహాయక సంఘాలకు వివిధ బ్యాంకుల దారా రుణాలను ఇప్పించనున్నారు. క్యాంటీన్ ఏర్పాటు చేసే ప్రాంతంలో స్థితిగతులను బట్టి రుణాలను మంజూరు చేసేందుకు బ్యాంక్ అధికారులు సహకరించనున్నారు.
ఒక్కో గ్రూపులో కనీసం 10 మంది సభ్యులు ఉండటంతో పాటు వంటలు చేయడంలో అనుభవం, క్యాటరిన్ నిరహణ తదితర వాటిని పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేశారు. ఎంపిక చేసిన మహిళా సంఘాల గ్రూప్ సభ్యులకు హైదరాబాద్‌లోని నీతం ఇన్‌స్టిట్యూట్‌లో పది రోజుల పాటు శిక్షణ ఇప్పిస్తారు. క్యాంటీన్ల నిరహణలో వివిధ రకాల మెళకువలు నేర్పించనున్నారు.
ఈ క్యాంటీన్లలో ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం పాటు రాత్రి భోజనం అందుబాటులో ఉంచనున్నారు. క్యాంటీన్‌లో లభించే టిఫిన్‌తో పాటు భోజనం బయట లభించే ధరల కంటే తక్కువగా ఉండనుంది. తక్కువ ధరతోపాటు నాణ్యమైన భోజనం లభించేలా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఏర్పాటు చేయాల్సిన సంస్థలివి..
గ్రూపు సంస్థలలో క్యాంటీన్‌లు, మీ సేవా కేంద్రం, ఈవెంట్ మేనేజ్‌మెంట్, స్ట్రీట్ వెండర్ కలెక్టివ్స్, కోల్డ్‌స్టోరేజీ, క్యాటరింగ్ సర్వీస్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తదితరాలు ఉన్నాయి. వ్యక్తిగత సంస్థల్లో కూరగాయలు, పండ్ల దుకాణాలు, బేకరీ, డెయిరీ, డెయిరీ ప్రొడక్ట్స్, మైక్‌సెట్స్, సౌండ్ సెట్స్, బ్యూటీ వెల్‌నెస్ సెంటర్స్, టెంట్‌హౌజ్, ఫాన్సీ స్టోర్, కిరాణ జనరల్ స్టోర్, ఫుడ్‌ట్రక్ వంటివి ఉన్నాయి.
వెంకటేశ్ బీర్కూర్‌వార్, ఆదిలాబాద్ (విజయక్రాంతి)
మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు
ఇప్పటికే మహిళా సయం సహాయక సంఘాలకు బ్యాంకు దారా అందించే రుణాలతో కొంత ఆర్థికంగా బలోపేతం అయ్యారు. ఈ క్యాంటీన్ల ఏర్పాటుతో మహిళలకు ఉపాధి లభించడంతో పాటు మరింత ఆర్థికంగా బలోపేతం కానున్నారు. మహిళా సంఘం సభ్యులకు ఉన్న అభిరుచిని బట్టి వివిధ రకాల చిరు వ్యాపారాల నిరహణకు అవకాశాలు ఉన్నాయి.
సర్వం సిద్ధం..
రాష్ర్ట ప్రభుతం జిల్లాల వారీగా ఏర్పాటు చేయనున్న మహిళా శక్తి క్యాంటీన్‌ల ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాగం ఆదేశాల మేరకు ఇప్పటికే పనులు ప్రారంభించాం. జిల్లాలో నాలుగు క్యాంటీన్ల ఏర్పాటులో భాగంగా రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇప్పటికే ఓ క్యాంటీన్ ఏర్పాటుకు మహిళా సంఘాలకు ఐదు లక్షల రుణంతో క్యాంటీన్ ఏర్పాటుకు అన్ని సిద్ధం అయ్యాయి.
బిట్ల గంగన్న, డీపీఎం, డీఆర్డీఏ