calender_icon.png 25 October, 2024 | 7:58 AM

ఆర్థికవృద్ధికి మిషన్‌లైఫ్

09-07-2024 02:25:15 AM

దక్షిణాది రాష్ట్రాలకు దిక్సూచీగా మారనున్న హైదరాబాద్

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): ప్రపంచ పురాతన ప్రఖ్యాత నగరాల్లో ముందువరసలో ఉన్న భాగ్యనగరం అద్భుతాలకు, ఆర్థికాభి వృద్ధికి నిలయంగా మారుతోంది. హరిత హైదరాబాద్‌గా అభివృద్ధి చెందే దిశగా గణనీయమైన పురోగతి కనబరుస్తూ ప్రకృతి పరిరక్షణతో పాటు ఇంధన వనరుల సంరక్షణ దిశగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ)తో కలిసి వడివడిగా అడుగులు వేస్తోంది. ‘మిషన్ లైఫ్’ కార్యక్రమంతో దక్షిణాది ప్రభుత్వాలు తమ రాష్ట్రా ల్లో దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం తో పాటు దేశ ఆర్థిక, వాతావరణ అభివృద్ధి లక్ష్యాలకు బీఈఈ నాయకత్వం వహిస్తోంది.

ఇంధన వనరుల పరిరక్షణలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ నిర్మాణా త్మక పాత్ర పోషిస్తోందని బీఈఈ భావిస్తోంది. మిషన్ లైఫ్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ రాష్ర్టంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో విస్తరించేందుకు సిద్ధమవుతోంది. 2028 నాటికి దేశంలోని 80 శాతం గ్రామా లు, పట్టణాల్ని పర్యావరణ అనుకూల ప్రాం తాలుగా తీర్చిదిద్దేందుకు బీఈఈ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 

ప్రధాని మోదీ ప్రారంభించిన మిషన్‌లైఫ్ ద్వారా ప్రస్తుత ‘యూజ్ అండ్ త్రో’ మోడల్‌కు దూరంగా పునర్వినియోగంతో ఆర్థిక వ్యవస్థని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యమని బీఈఈ కార్యదర్శి మిలింద్ దేవరా స్పష్టం చేశారు. పర్యావరణ వ్యవస్థను పునర్నిర్మించడమే ప్రధాన ఉద్దేశంగా నిర్దేశిం చుకున్న మిషన్ లైఫ్ వాతావరణ అనుకూల ప్రవర్తన కోసం ప్రజల్ని మమేకం చేయడంతో స్థిరమైన పురోగతి సాధించడంతో పాటు ఇంధన వనరుల పరిరక్షణనను బలోపేతం చేయడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. భారత్‌లోని కొన్ని ప్రధాన నగరాల్లో కలవరపెడుతున్న నీటి కొరత, పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, మిషన్ లైఫ్ అమలు కార్యక్రమం దక్షిణాది రాష్ట్రాల్లో మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటోంది.

మిషన్ లైఫ్ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలకు దిక్సూచీగా మారనుందని బీఈఈ అభిప్రాయపడుతోంది. ఇందుకనుగుణంగా ఏపీలో మిషన్ లైఫ్ కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంపైనా బీఈఈ తన ప్రయత్నాలను కొనసాగించాలని యోచిస్తోందని దక్షిణాది రాష్ట్రాలు, యూటీల బీఈఈ మీడియా సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మిషన్ లైఫ్‌ను నడిపేందుకు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, కేంద్రపాలిత ప్రాంతాలలోని నగరా లు, ముఖ్యంగా హైదరాబాద్‌లో కొనసాగుతున్న ప్రయత్నాలు స్థిరమైన అభివృద్ధి, ఇంధన సామర్థ్యానికి బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.