calender_icon.png 26 April, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిషన్ భగీరథ పనులు వేగవంతంగా చేయాలి

26-04-2025 12:49:28 AM

కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, ఏప్రిల్ 25 (విజయ క్రాంతి): షన్ భగీరథ పైప్ లైన్ పను లు వేగవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులతో శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్గుల్ (నిజామాబాద్ జిల్లా) నుండి కామారెడ్డి కి సరఫరా చేసే మిషన్ భగీరథ 14 కిలోమీటర్ల  పైప్ లైన్ పనులు వేగంగా పూర్తిచేయాలని అన్నారు. కామారెడ్డి మున్సిపల్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు నీటి సరఫరా చేస్తున్న వివరాలు ఎరోజుకు ఆరోజు సమర్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

రోజువారీ కామారెడ్డి కి వస్తున్న నీరు వార్డుల వారీగా సరఫరా చేస్తున్న వివరాలు ప్రతీరోజు సమర్పించాలని అన్నారు. పట్టణ ప్రాంతంలో రీచార్జ్ స్ట్రక్చర్స్ నిర్మాణాలు చేపట్టాలని, ఇంకుడు గుంతలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వచ్చే వర్షాకాలం నాటికి రీఛార్జ్ స్ట్రక్చర్స్ నిర్మించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, మిషన్ భగీరథ ఎస్‌ఈ రాజేంద్ర కుమార్, ఈఈ నరేష్, మున్సిపల్ కమీషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈఈ శంకర్, తదితరులు పాల్గొన్నారు.