calender_icon.png 6 April, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిషన్ భగీరథ నీటిని ప్రత్యేక ట్యాంకుల, పైపుల ద్వారానే సరఫరా చేయాలి..

05-04-2025 09:07:54 PM

- గత ప్రభుత్వం పాత ట్యాంకులకు రంగులు వేసి మిషన్ భగీరథ ట్యాంకులుగా మార్చారు..

- ప్రతి వ్యక్తికి 150 లీటర్ల నీటిని అందే విధంగా ప్రణాళికలు చేయండి..

- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

మునుగోడు (విజయక్రాంతి): మునుగోడు ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం శుద్ధి చేసిన త్రాగునీరు ప్రతి ఒక్కరికి అందేలా శాశ్వత పరిష్కారం చూపి మిషన్ భగీరథ నీరు ప్రత్యేక ట్యాంకులు పైప్లైన్ ద్వారానే సరఫరా చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం మునుగోడు నియోజకవర్గం లో  త్రాగునీటి సమస్యపై  నల్గొండ ,యాదాద్రి జిల్లాలకు చెందిన మిషన్ భగీరథ అధికారులు, మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులతో కలిసి మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు.

క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను ఆయా మండలాల నాయకులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.మునుగోడు నియోజకవర్గానికి  మిషన్ భగీరథ నీరు అందించే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్  పాయింట్లైన  లింగోటం, ఉదయ సముద్రం  ల నుండి ప్రతిరోజు  ఎన్ని లీటర్ల నీరు సరఫరా అవుతుందిని, అంశాల గురించి జిల్లాల వారీగా మండలాల వారీగా  మిషన్ భగీరథ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీలలో ఉన్న పాత ట్యాంకులకు రంగులు వేసి మిషన్ భగీరథ ట్యాంకులుగా మార్చారని  వీటిలో బోరు నీళ్లు మిషన్ భగీరథ నీటిని నింపుతున్నారని, ఈ విధానానికి స్వస్తి పలికి  మిషన్ భగీరథ ట్యాంకులను వేరుచేసి  శుద్ధి చేసిన నాణ్యమైన తాగునీటి అందించాలని అధికారులను ఆదేశించారు.

తాగునీటి సరఫరా, స్టోరేజీ,ట్యాంకుల క్లీనింగ్, నల్లాలకు కంట్రోల్ వాల్సు తీయకుండా చూడడం, మిషన్ భగీరథ బోర్ నీళ్లు కలవకుండా చూడడం వంటి విషయాలలో గ్రామపంచాయతీ సెక్రటరీ లు బాధ్యత తీసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని, వేసవిలో తాగునీటి కొరతను అధిగమించడానికి ప్రతి మండలంలో అవసరమైన చోట బోర్లు వేసి సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానిక నాయకులను ఆదేశించారు... సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని  ఎప్పటికప్పుడు త్రాగునీటి సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత  అందరిపై ఉందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో  నల్గొండ జిల్లా మిషన్ భగీరథ ఎస్ ఈ  నాగేశ్వరరావు, యాదాద్రి జిల్లా ఎస్ఈ కృష్ణయ్య, మిషన్ భగీరథ ఈఈ లు డీఈలు, ఏఈలు, వివిధ మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.