calender_icon.png 20 September, 2024 | 5:31 PM

నీళ్లు రావు చూసి వాడుకోండి

20-09-2024 02:30:07 PM

ఈ ప్రాంతాలకు 48 గంటల పాటు నీటి సరఫరా బంద్

మహబూబ్​నగర్,(విజయక్రాంతి): నీళ్లు రావు ఉన్న నిధిని చూసి వాడుకోవాలని మిషన్ భగీరథ కార్యనిర్వాహణ అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈనెల 21వ తేదీ నుంచి ఉదయం 6:00 గంటల నుంచి 23వ తేదీ ఉదయం 6:00గంటల వరకు  48 గంటలు నీటి సరఫరా నిలిపి వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నీటి సరఫరా కు సంబంధించి మరికల్ నుండి నారాయణపేట పోయే దారిలో  మరికల్ గ్రామం చివర మిషన్ భగీరథ పైపులైన్ 4 ప్రదేశాలలో లీకేజీ అవుతున్నందున పైపులు తీసి కొత్త పైపులు అమర్చటానికి నీటి సరపరా నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పనులను పూర్తి చేసేందుకు గాను ఇట కావడానికి 48 గంటలు నీటి సరపరా ఆపివేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

దీనివలన మన్యంకొండ నీటి శుద్ధి కేంద్రం నుండి నీటి సరపరా అయ్యే దేవరకద్ర, నారాయణపేట, మక్తల్ ఆసెంబ్లీ నియోజక వర్గాలలోని దేవర్కద్ర, నర్, మరికల్, ఊట్కూర్, నారాయణపేట, దామరగిద్ద మండలాలు పూర్తిగా , కౌకుంట్ల, చిన్నచింతకుంట మండలంలోని ఆయా గ్రామాలకు48 గంటల పాటు సరఫరా నీటి సరఫరా నిలిపివేయడం జరిగిందని తెలిపారు. దన్వాడ మండలాలు పాక్షికంగా, మక్తల్ నారాయణపేట మున్సిపాలిటీలు పూర్తిగా మొత్తం 245 గ్రామాలలాకు 2 మున్సిపాలిటీ లు నీటి సరపరా ఉండదన్నారు. ప్రజలందరూ సహకరించగలరని వారు కోరారు.