calender_icon.png 23 February, 2025 | 6:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృథా అవుతున్న మిషన్ భగీరథ నీళ్లు

13-02-2025 02:00:31 AM

పెద్ద కొడఫ్గల్, ఫిబ్రవరి 12 (విజయ క్రాంతి) ఙ పెద్ద కొడఫ్గల్ మండలం ఎల్కంటి చెరువు సమీపంలో మిషన్ భగీరథ ప్రధాన పైపు లైన్ నుంచి నీరు వృధాగా పోవడంతో గ్రామస్తులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల మరియు గ్రామాల ప్రజలు మిషన్ భగీరథ సిబ్బంది మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

గత 5 రోజులుగా మండల కేంద్రానికి తప్ప మిగతా గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు సమస్యపై స్పందించకపోవడంతో ఆయా గ్రామస్తులు నిరాశ చెందుతున్నారు. గ్రామస్థులు తక్షణమే నీటి లీకేజీని అరికట్టాలని, తాగునీరు అందించాలని అధికారులను కోరుతున్నారు.