calender_icon.png 19 March, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ కళాశాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా అందించాలి

18-03-2025 07:43:35 PM

ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో మిషన్ భగీరథ, మెడికల్ కళాశాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శాశ్వత ప్రాతిపదికన మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, కళాశాలకు అవసరమైన నీటి సరఫరాకు ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. ఈ వేసవి కాలంలో ప్రస్తుతం అద్దెలో భవనాల్లో నడుస్తున్న హాస్టల్ లలో నీటిని ట్యాంకర్ల ద్వారా నీటినిసరఫరా చేయాలని మున్సిపల్ కమీషనర్ కు సూచించారు. ఈ సమావేశంలో  మిషన్ భగీరథ  ఎస్ఈ రాజేంద్ర కుమార్, డిప్యూటీ ఈఈ నవీన్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.శివ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జయప్రకాష్ లు పాల్గొన్నారు.