మునిపల్లి: మిషన్ భగీరథ పైపులు వద్ద ఒకేసారి మంటలు వ్యాపించి లక్షలు విలువ చేసే పైపులు కాలిపోయినాయి. ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలం బుదేరా గ్రామ శివారులో మిషన్ భగీరథ పైపులు ఖాళీ బూడిదైనాయి. మంటలు ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. వేసవిలో తాగునీటి సమస్యను నివారించేందుకు కొత్తగా మిషన్ భగీరథ పైపులు వేసేందుకు బుదేరా శివారులో పైపులను నిలువ చేశారు. మంటలు వ్యాపించి పైపులు కాలిపోవడం జరిగింది.