10-04-2025 07:02:53 PM
అధికారుల చర్యలు శూన్యం..
చర్ల (విజయక్రాంతి): మండలంలోని ఆర్ కొత్తగూడెం గ్రామం ప్రధాన ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న మిషన్ భగీరథ పైపు పగిలి నీరు ఏరులై వృధాగా పోతుంది. దీంతో ఇళ్లలోకి తాగు నీరు రాక గ్రామస్తులు అష్ట కష్టాల పాలవుతున్నారు. పంచాయతీ అధికారులు, మిషన్ భగీర అధికారులు ఇటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు, సంబంధిత మిషన్ భగీరథ అధికారులు స్పందించి పగిలిన పైపులైన్లకు మరమ్మతులు చేసి మిషన్ భగీరథ మంచినీళ్లు సక్రమంగా సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.