రాజేంద్రనగర్, సెప్టెంబర్ 23: ఓ మహిళ అదృశ్యమైన సంఘటన శం షాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరా ల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం తుడుకుర్తికి చెందిన 45 ఏళ్ల రమావత్ బద్ది కొద్దిరోజులు గా అనారోగ్యంతో బాధపడుతున్నది. ఇటీవల ఆమె నగరంలోని గచ్చిబౌలి ఉంటున్న సోదరుడు జటావత్ జయబాబు ఇంటికి వచ్చింది. జయబాబు ఈనెల 21న నగరంలో ఓ ఆస్పత్రిలో సోదిరికి వైద్యం చేయించాడు. అనంతరం ఎంజీబీఎస్ బస్టాండ్లో ఆమె ను వనపర్తి వెళ్లే బస్సులో ఎక్కించా డు. కొద్దిసేపటి తర్వాత ఆమెకు కాల్ చేయగా మరో వ్యక్తి లిఫ్ట్ చేసి ‘మీ సోదరి శంషాబాద్లో ఉంది. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంది..’ అని చెప్పాడు. ఆ తర్వాత జయబాబు మళ్లీ కాల్ చేయగా ఫోన్ స్విఛాఫ్ వచ్చింది. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో జయబా బు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.