కాప్రా: ఇంటి నుంచి పని కోసం వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం జార్ఖండ్ రాష్ట్రం నుంచి గత నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి సునీత(42) జీవనోపాధి కోసం పెద్ద చర్లపల్లికి వచ్చి నివాసముంటున్నారు. కాగా ఇంటి నుంచి చర్లపల్లి పారిశ్రావాడకు పని కోసం వెళ్లి తిరిగి సునీత ఇంటికి రాకపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు గమనించి తెలిసిన వారి వద్ద, చుట్టుపక్కల గాలించిన ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.