24-03-2025 08:30:22 PM
కొండపాక: మహిళ అదృశ్యమైన సంఘటన కుకునూరుపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కాలువ లైలా(27) భర్త రాజేష్ తో పాటు బతుకుదెరువు కోసం కుకునూరుపల్లి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ హోటల్లో పనిచేస్తున్నారు. గత నెల ఫిబ్రవరి 28 తేదీన తన భర్త రాజేష్ ఉదయం లేచి వాష్ రూమ్ కి వెళ్లి వచ్చి చూసేసరికి తన భార్య లైలా కనిపించలేదని, నా భార్య అదృశ్యం సుమన్ అనే వ్యక్తిపై అనుమానం ఉన్నదని అన్నారు. భర్త రాజేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.