calender_icon.png 27 December, 2024 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు రోజులుగా లభించని విద్యార్థి ఆచూకీ

02-12-2024 01:55:28 PM

నారాయణఖేడ్,(విజయక్రాంతి): నారాయణఖేడ్ సమీపంలోని జూకల్ శివారులో గల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నుండి తప్పిపోయిన విద్యార్థి గత నాలుగు రోజులు గడిచిన ఇంతవరకు ఆచూకీ లభించలేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నవంబర్ 29న హాస్టల్ నుండి బిస్కెట్లు తెచ్చుకుంటానని బయటికి వెళ్లిన విద్యార్థి గొల్ల సాయి ప్రకాష్ (13) బయటికి వెళ్లి హాస్టల్ కు తిరిగి లేకపోవడంతో సంబంధిత హాస్టల్ నిర్వాహకులు కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా స్థానిక పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు విద్యార్థి ఆచూకీ లభించలేదు. సదురు విద్యార్థి నీలిరంగు ప్యాంటు, తెల్ల చొక్కా ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. విద్యార్థి స్వగ్రామం నారాయణఖేడ్ మండలం చందాపూర్ అని తెలిపారు. ఎవరికైనా సమాచారం ఉంటే నారాయణఖేడ్ పోలీసులకు కానీ హాస్టల్ నిర్వాహకులకు సమాచారం అందించాలని వారు కోరుతున్నారు.