కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): వివాహిత మహిళా మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు జైనూర్ ఎస్ఐ సాగర్ శుక్రవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం జైనూర్ మండలం జెండాగూడ గ్రామానికి చెందిన గుగుల్ వార్ శ్రీరామ్, గోదావరి దంపతులకు ఆరుగురు సంతానం, 5వ కూతురు శారదాను అదే గ్రామానికి చెందిన మడపు పవార్ కు ఇచ్చి గత ఏడాది వివాహం చేశారు. ఈక్రమంలోనే మగ సంతానం కలగడం లేదనే విషయంలో భార్య భర్తల మధ్య విభేదాలు రావడంతో ఈ నెల 21న కుల పెద్దల సమక్షంలో విడాకులు తీసుకునేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో 23న రాత్రి బాత్రూం కనీ చెప్పి వెళ్లిన శారదా తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ కోసం చుట్టూపక్కల గాలించినా లభించలేదు. ఫోన్ కుడా స్విచ్ ఉండటంతో కుటుంబ సభ్యులు జైనూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాగర్ పేర్కొన్నారు.