ఒకరు నిజామాబాద్‌లో, ఇద్దరు వేములవాడలో..
నిజామాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు బాలికలు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. జిల్లాలోని నవీపేట బాలికల ప్రభు ఉన్నత పాఠశాలలో కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవళిక పదో తరగతి చదువుతున్నారు. గురువారం ఉదయం బడికి బయల్దేరిన విద్యార్థినులు తిరిగి ఇండ్ల కు రాలేదు.
తల్లితండ్రులు ఆందోళనకు గురై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై వినయ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని, మూ డు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. 24 గంటల్లోనే బాలికల ఆచూకీని కనుగొ న్నారు.
శుక్రవారం ఉదయం నిజామాబాద్ బస్టాండ్‌లో కొండపల్లి శిరీషను, వరలక్ష్మి, రవళికలను వేముల గుర్తించిన పోలీసులు శుక్రవారం రాత్రి నవీపేట ఎస్సై వినయ్‌కుమార్ ఆధ్వర్యంలో నవీపేటకు తీసుకొచ్చి, తల్లిదండ్రులకు అప్పగించారు. బాలికలను ఎవరైనా కిడ్నాప్ చేశారా? బాలికలే సరదాగా వేములవాడ ఆలయానికి వెళ్లారా? అనే కోణంలో విచారణ చేపట్టినట్లు ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు.