calender_icon.png 30 September, 2024 | 1:06 AM

తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన చిన్నారి

29-09-2024 10:06:20 PM

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని శ్రీపతి నగర్ కు చెందిన చిన్నారి సనా ఫిర్జోష్(5) ఆదివారం ఆడుకునేందుకు ఇంటి నుండి బయటకు వెళ్లి కనబడకుండా పోయింది. చుట్టుపక్కల పరిసరాలలో వెతికిన తల్లిదండ్రులకు చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు ఎండి సాజిదా, రియాజ్ లు పట్టణ పోలీసులను ఆశ్రయించడంతో పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్ స్పందించి హుటాహుటిన ఆరు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి, విస్తృతంగా తనిఖీలు నిర్వహించి చిన్నారి ఆచూకీ కనుగొన్నారు. అతి తక్కువ సమయంలోనే చిన్నారిని వెతికి పట్టుకుని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. తక్కువ సమయంలోనే పాప ఆచూకీ కనిపెట్టిన పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్ కు, పోలీస్ సిబ్బందికి పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలా ఉండగా ఫిర్యాదు అందిన తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి చిన్నారి ఆచూకీ కనుగొన్న ఎస్ఐ రాజశేఖర్ ని కాలనీ వాసులు పట్టణ ప్రజలు అభినందించారు. ఇటీవల  పట్టణంలోని పాలవాగులొ ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన గాదే శ్రీనివాస్ మృత దేహాన్ని స్వయంగా ఎస్ఐ వాగులో నుండి బయటకు తీసుకు వచ్చి ప్రజల అభిమానం చూరకొనగా తాజాగా తప్పిపోయిన చిన్నారిని అతి తక్కువ సమయంలోనే ఆచూకీ కనుగొని ప్రజల ఆదరాభిమానాలు పొందారు. ఏదేమైనప్పటికీ బాధ్యతతో పాటు స్వయంగా స్పందించే హృదయం ఉన్న ఎస్ఐ పట్టణంలో విధులు నిర్వహించడం పట్టణ ప్రజల అదృష్టమని పలువురు ఎస్ఐ రాజశేఖర్ ను అభినందించారు.