calender_icon.png 1 November, 2024 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చమురు నౌకపై మిస్సైల్ దాడి

28-04-2024 02:19:04 AM

స్వల్పంగా దెబ్బతిన్న నౌక.. ధ్రువీకరించిన ‘హౌతీస్’

పాలస్తీనాకు మద్దతుగా వాణిజ్య నౌకలు టార్గెట్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: యెమెన్ తిరుగుబాటుదారులు హౌతీస్ ప్రయోగించిన క్షిపణి ఎర్రసముద్రంలో ‘ఎండ్రోమెడా స్టార్’ చమురు నౌకను ఢీకొట్టింది. ఘటనలో నౌక స్పల్పంగా దెబ్బతిన్నది. రష్యాలోని ప్రిమోర్క్స్ రేవు నుంచి నౌక భారత్‌లోని వాదినార్ పోర్ట్‌కు వస్తుండగా మిస్సైల్ దాడి సంభవించింది. శనివారం హౌతీస్ తిరుగుబాటుదా రులు ఈ ఘటనను ధ్రువీకరించారు. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా హౌతీస్ ఖరీదైన సరుకులు, ఇంధనాలను రవాణా చేసే యూఎస్, యూకే, ఇజ్రాయెల్ వాణిజ్య నౌకలను టార్గెట్ చేస్తున్నది. వాటిపై క్షిపణులను ప్రయోగించి నౌకలను ధ్వంసం చేస్తున్నది. కొద్దిరోజులు స్తబ్దుగా ఉన్న హౌతీస్ తాజాగా ‘ఎండ్రోమెడా స్టార్’పై క్షిపణిని ప్రయోగించింది. ఈ నౌక గతంలో యూకే అధీనంలో ఉండేదని, ఇప్పు డు ఆ నౌకను సైషెల్స్ కోనుగోలు చేసిందని సమాచారం. హౌతీస్ శుక్రవారం యెమన్ గగనతలంలో సంచరిస్తున్న యూఎస్‌కు చెందిన ఎంక్యూ9 డ్రోన్‌ను కూల్చివేసినట్లు ప్రకటించింది.