09-04-2025 01:38:22 AM
హైదరాబాద్‌కు రానున్న 120 దేశాల మోడల్స్
చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్
చౌమొహల్లా ప్యాలెస్‌లో వెల్‌కమ్ డిన్నర్
స్వాగత ఏర్పాట్లపై అధికారుల సమీక్ష
హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): తెలంగాణ టూరిజం బ్రాండ్ పెరిగేలా, రాష్ట్ర అతిథ్యానికి వన్నెతెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు ఉండాలని తెలంగాణ టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్వాగత ఏర్పాట్లపై మంగ ళవారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు.
మే 7 నుంచి 31 వరకు 72వ మిస్‌వ రల్డ్ పోటీలు తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో జరుగనున్నాయి. ఈ పోటీల్లో 120 దేశాల మోడల్స్ పాల్గొంటున్నారు. వారం తా మే 6, 7 తేదీలలో హైదరాబాద్‌కు చేరుకుంటారు. మోడల్స్ రాక సందర్భంగా చార్మి నార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్‌లో వెల్‌కమ్ డిన్నర్ ఏర్పాటు చేశారు.
ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు టూరిజం, జీహెచ్‌ఎంసీ, హెరిటేజ్, పోలీస్ ఆఫీసర్లు ప్యాలెస్‌లో పర్యటించారు. వెల్‌కమ్ డిన్నర్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ఉండాలని స్మితా సబర్వాల్ అధికారులకు సూచించారు. మోడల్స్‌తో పాటు 400 మంది ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్లు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు పాల్గొంటు న్నట్టు తెలిపారు. ఈ ఈవెంట్‌లో ఆద్యాంతం పర్యాటక ప్రత్యేకతలు చాటేలా కార్యక్రమాలుండాలని చెప్పారు.
ప్యాలెస్‌లో ఫొటో షూట్ కోసం సీటింగ్ ఏర్పాట్లు, లైవ్ మ్యూ జిక్ కాంటెస్ట్, సూఫీ, కవ్వాలీ సంగీత కార్యక్రమాలు, తెలంగాణ సంస్కృతీ సంప్రదా యాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు ఉండాలని అధికారులను స్మితా సబర్వాల్ ఆదేశిం చారు. వెల్‌కమ్ డిన్నర్‌లో తెలంగాణ రుచు లు, నిజాం వంటకాలు మెనూలో ఉంటాయన్నారు. మీక్షలో టూరిజం డైరెక్టర్ హను మంతు, డైరెక్టర్ యూత్ సర్వీసెస్ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావు, సెట్వీన్ ఎండీ వేణుగోపాల్, టూరిజం, జీహెచ్‌ఎంసీ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.