calender_icon.png 11 October, 2024 | 4:38 AM

లైట్‌హౌస్‌ను కోల్పోయా!

11-10-2024 02:53:00 AM

మీ నిష్క్రమణతో మన స్నేహంలో శూన్యమే మిగిలింది

దాన్ని పూడ్చేందుకు జీవితాంతం ప్రయత్నిస్తా

టాటా మరణంపై యువ స్నేహితుడు శాంతను పోస్ట్

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: దిగ్గజ పారిశ్రామిక వేత్త, మానవతామూర్తి రతన్ టాటా మరణంపై ఆయన అత్యం త నమ్మకమైన సహాయకుడు, స్నేహితు డు, 30 ఏళ్ల యువ జనరల్ మేనేజర్ శాంతను నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గుడ్‌బై మై డియర్ లైట్ హౌస్ అంటూ లింక్డ్‌ఇన్ వేదికగా తుది వీడ్కోలు పలికారు.

మీరు వెళ్లిపోవ డంతో మన స్నేహంలో శూన్యమే మిగి లింది. ఆ లోటు పూడ్చేందుకు జీవిం తాంతం ప్రయత్నిస్తా. మీ ప్రేమ దూరమవడం వల్ల వస్తోన్న బాధ ఎప్పటికీ తగ్గదు. గుడ్‌బై మై డియర్ లైట్‌హౌస్ అని శాంతను తన బాధను వ్యక్తం చేస్తూ రతన్ టాటాతో గతంలో దిగిన చిత్రాన్ని షేర్ చేశారు. 

జంతు ప్రేమతో కుదిరిన స్నేహం

వీధి శుకనాలపై ప్రేమ కారణంగా వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. రాత్రి వేళల్లో వీధికుక్కలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా వాటి మెడలో రేడి యం కాలర్లు వేసేందుకు మోటోపాస్ అనే కార్యక్రమాన్ని శాంతను ప్రారంభిం చారు. తన ప్రయత్నంతో ఎన్నో కుక్కల ప్రాణాలు కాపాడారు. దీనికి ఆర్థిక మద్దతు కోసం రతన్‌టాటాకు స్వయం గా లేఖ రాశారు.

ఈ విషయం తెలుసు కున్న టాటా స్పందించడమే కాకుండా స్వయంగా శాంతనుతో భేటీ అయ్యారు. అప్పుడు వారిద్దరి మధ్య కలిసిన మాట లు ఎల్లలు లేని స్నేహానికి దారితీసింది. టాటా భుజాలపై చేతులు వేసి మాట్లా డేంత చనువు శాంతనుకు ఉంది. సామా జిక మాధ్యమాల్లో టాటా ఖాతాలు తెరవడం వెనుక కూడా శాంతను హస్తముందని, సోషల్ మీడియా అడ్వైజర్ కూడా శాంతనునే. 2018లో శాంతను డిగ్రీ పట్టా తీసుకునే సమ యంలో అమెరికాకు సైతం రతన్‌టాటా వెళ్లడం విశేషం. 

వృద్ధులకూ సాయంగా..

ఇద్దరికీ పెరిగిన పరిచయంతో టాటా కు అసిస్టెంట్‌గా ఉంటూ ప్రస్తుతం జనరల్ మేనేజర్ స్థాయికి శాంతను ఎదిగారు. టాటా వ్యక్తిత్వం, ఆయనతో అనుబంధం గురించి ఐ కేమ్ అపాన్ ఏ లైట్‌హౌస్ అనే పుస్తకం కూడా రాశారు. రతన్ టాటాకు జీఎంగా వ్యవహరిస్తూనే వృద్ధులకు చేదోడుగా ఉండే గుడ్‌ఫె ల్లోస్ అనే స్టార్టప్‌ను సైతం శాంతను ప్రారంభించారు. ప్రస్తుతం దీని విలువ రూ.5 కోట్ల వరకు ఉంటుంది.

ఈ ఆలోచన తననెంతో ఆకర్షించిందని ఓ సమయంలో రతన్ టాటా వెల్లడిం చారు. ఇందులోనూ టాటా పెట్టు బడులు పెట్టారు. యువ ఎంటర్ ప్రిన్యూర్ల కోసం యువర్ స్పార్క్స్ అనే కౌన్సెలింగ్ వేదికనూ శాంతను నడిపిస్తున్నారు. టాటాకు ఇంత ఆప్తుడిలా మారిన శాంతను పుణెలోని ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు. శాంతను కుటుంబసభ్యుల్లో అందరూ టాటా కంపెనీల్లోనే పనిచేయడం గమనార్హం.