calender_icon.png 13 January, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిస్సమ్మకు ౭౦ ఏళ్లు!

12-01-2025 12:00:00 AM

‘మిస్సమ్మ’ చిత్రం 1955 జనవరి 12న విడుదలైంది. ఈ చిత్రం విడుదలై నేటికి 70 ఏళ్లు. పూర్తి హాస్య చిత్రంగా ఎల్‌వీ ప్రసాద్ దర్శకత్వంలో రూపొం దింది. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రం ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్వీ రంగారావు, జమున, రేలంగి, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు. వాస్తవానికి చక్రపాణి ఈ సినిమాతో పెద్ద సాహసమే చేశారని చెప్పాలి.

ఎందుకంటే 70 ఏళ్ల క్రితం సంప్రదాయం, కట్టుబాట్లకు పెద్ద పీట వేసేవారు. అలాంటి రోజుల్లో స్త్రీ.. ఒక పురుషుడికి భార్యగా నటించడం అనేది ఒక దుస్సాహసమే. నాటి పరిస్థితుల నేపథ్యంలో జనం దానిని అంగీకరించడం చాలా కష్టం. చక్రపాణి అలాంటి కథను ఎంచుకుని అత్యంత సమర్థవం తంగా దానిని జనాల్లోకి తీసుకెళ్లి మంచి సక్సెస్ సాధించారు.

‘పెద్దలు సైతం చూడవలిసిన పిల్లల సినిమా’ అంటూ ప్రచారం చేయించారు. ఎన్టీ రామారావు, సావిత్రకి సరిగా పరిచయం కూడా ఉండదు. అయినా సరే.. ఎన్టీఆర్‌కి భార్యగా నెలల తరబడి నటించక తప్పని పరిస్థితి వస్తుంది. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుందనేదే కథాంశం. ఆద్యంతం హాస్యంతో చక్కగా సినిమాను దర్శకుడు ఎల్వీ ప్రసాద్ రక్తికట్టించారు.