calender_icon.png 15 November, 2024 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టును తప్పుదోవ పట్టిస్తారా?

20-07-2024 01:08:41 AM

రూ.10 వేలు జరిమానా చెల్లించండి: హైకోర్టు

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): ఓ ఫ్లాట్ రిజిస్ట్రేషన్‌కు సంబం ధించి కోర్టును తప్పుదోవ పట్టిస్తూ సబ్‌రిజిస్ట్రార్‌పై వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు సమయం వృథా చేసినందుకు రూ.10 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజులరామారంలో సర్వే నెం.329/4, 329/5లో మహదేవపురం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఫేజ్ లో 200 గజాల ఇంటికి అన్ని పత్రా లు సమర్పించినా కుత్బుల్లాపూర్ సబ్‌రిజిస్ట్రార్ తిరస్కరించారంటూ మహే శ్వర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టగా ప్రభుత్వ న్యాయవాది రాకేశ్‌కుమార్ వాదనలు విని పిస్తూ.. పిటిషనర్ సబ్ రిజిస్ట్రార్ను కలవలేదని, ఎలాంటి పత్రాలను సమ ర్పించలేదని తెలిపారు. అంతేకాకుండా ఎలాంటి నిబంధనలు పాటించకుండా నేరుగా కోర్టుకు వచ్చారన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు జరిమానా విధించింది.