02-04-2025 07:54:06 PM
న్యూఢిల్లీ: వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) మాట్లాడారు. వక్ఫ్ బిల్లు అంశంపై విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని అన్నారు. వక్ఫ్ బిల్లుకు మెజారిటీ వర్గాల మద్దతు ఉందని, వక్ఫ్ బిల్లు అతిపెద్ద సంస్కరణ అని తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగబద్ధమేనని, కొన్ని పార్టీలు మైనార్టీలను ఓటు బ్యాంకు రాజకీయలకు వాడుకుంటున్నాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు.
వక్ఫ్ బిల్లు((Waqf Amendment Bill))పై మైనార్టీల్లో అపోహలు సృష్టిస్తున్నారని, తెలంగాణ, హరియాణా, యూపీ వంటి రాష్ట్రాల్లో వక్ఫ్ భూములపై కేసులు ఉన్నాయన్నారు. వక్ఫ్ ఆస్తులను ప్రార్థన, ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తే ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వక్ఫ్ భూములను అక్రమాలకు ఉపయోగిస్తే చర్యలు ఉంటాయని, వక్ఫ్ ఆస్తులను అడ్డుపెట్టుకొని కొందరు వందల కోట్లు సంపాదిస్తున్నారని తెలిపారు. వక్ఫ్ ఉన్నది పేదల ముస్లింల కోసం.. దొంగల కోసం కాదు అని.. వక్ఫ్ బిల్లు ముస్లింలకు మేలు చేసేదే తప్ప కీడు చేసేది కాదు అన్నారు. వక్ఫ్ లో ముస్లిమేతరులకు చోటు లేదని, వక్ఫ్ ఆస్తుల సక్రమ వినియోగానికి ఈ బిల్లు తోడ్పడుతుందన్నారు. ఈ బిల్లు వక్ఫ్ లో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తుందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు.