calender_icon.png 16 November, 2024 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనపై అపోహలు సృష్టిస్తున్నారు

16-11-2024 12:52:26 AM

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ఫైర్

అధికారంలోకి వచ్చిన 11నెలల్లోనే 45వేల ఉద్యోగాలిచ్చామని వెల్లడి

హైదరాబాద్ సిటీబ్యూరో/సిద్దిపేట, నవంబర్ 15 (విజయక్రాంతి): రాజకీయ కుట్రల కారణంగానే కులగణనపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సర్వేతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దవుతాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. గురువారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిక్ విలేజ్‌లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌తో కలిసి మంత్రి దోభీఘాట్ గ్రౌండ్‌ను పరిశీలించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. సర్వేకు వ్యతిరేకంగా ఎవరైనా నిరసనలు చేపడితే మాకు అభ్యంతరం లేదని.. అయితే చట్టాన్ని చేతిలో తీసుకుంటామంటే మాత్రం చట్టం తనపనితాను చేసుకుపోతుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో.. ప్యారడైజ్ నుంచి షామీర్‌పేట జంక్షన్ (రాజీవ్ రహదారి), డెయిరీ ఫాం (జాతీయ రహదారి 44) వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్లతో కంటోన్మెంట్ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అనంతరం సికింద్రా బాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదం సంతోష్ ఆధ్వర్యంలో మెట్టుగూడ రైల్వే మెకానిక్ వర్క్ షాప్ వద్ద సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ కార్యాలయాన్ని మంత్రి సందర్శించారు. డిసెంబరు 5న జరగనున్న సౌత్ సెంట్రల్ రైల్వే ఎన్నికల్లో ఎం.రాఘవయ్య ప్యానెల్‌ను గెలిపించాలని ఆయన కోరారు. 

కర్మన్‌ఘాట్‌లో కార్తీక పౌర్ణమి పూజలు

ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్‌ఘాట్‌లోని హనుమాన్ ఆలయంలో నిర్వహించిన కార్తీక పౌర్ణమి పూజా కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై స్వామివారికి అభిషేకం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా న్యాయమూర్తి నాగశ్రావ్య, చంపాపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్‌రెడ్డి తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

45వేల ఉద్యోగాలిచ్చాం..

కాంగ్రెస్ పార్ట్టీ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే 45 వేల ప్రభుత్వ ఉదోగాలు భర్తీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో జరిగిన వారోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతీ గ్రామంలో గ్రంథాలయం ఎర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.