* అబద్ధాలతో రేవంత్‌రెడ్డి పాలన
* కాళేశ్వరం విచారణకు పిలిస్తే నేను, కేసీఆర్ వెళ్తాం
* మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 21(విజయక్రాంతి): అసెంబ్లీలో రైతుభరోసాపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం రాజకీయ ఉపన్యాసంలా ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర అప్పులపై ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్ధాలేనని స్పష్టంచేశారు. అసెంబ్లీలో సీఎం తీరు పోతరాజు మాదిరిలా ఉందన్నారు. అప్పుల విష యంలో ప్రభుత్వం నోరు మూయించామని.. మూసీ కంపు కంటే సీఎం నోటి కంపే ఎక్కువగా ఉందన్నారు. శనివారం అసెంబ్లీలోని బీఆర్‌ఎస్‌ఎల్పీ హాల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తాము వద్దంటున్నామని.. ఆర్‌ఆర్‌ఆ ర్‌ను అడ్డుకుంటున్నామనడంపై మండిపడ్డారు. రైతుభరోసా విషయంలో తుమ్మల రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.
కాళేశ్వరం విచారణకు వెళ్తాం..
కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిస్తే తాను, కేసీఆర్ వెళ్తామని హరీశ్‌రావు చెప్పారు. కాళేశ్వరంతో 50వేల ఎకరాలు మాత్రమే సాగతవుతున్నట్టు సీఎం చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణకు సాగు, తాగునీరు అందిస్తున్నది కాళేశ్వరమేనని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారన్నారు. తాము ఫార్మాసిటీలో ఒక్క ఎకరం కూడా ఏ కంపెనీకి ఇవ్వలేదని స్పష్టంచేశారు. ఎస్సెల్బీసీకి తాము 11 కిలోమీటర్లు తవ్వితే ఒక్క కి.మీ. కూడా తవ్వలేదని సీఎం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశా రు.
తన నియోజకవర్గ అభివృద్ధిని సీఎం రేవంతే అడ్డుకున్నారని విమర్శించారు. సిద్ధిపేటలో నాబార్డు నిధులతో మొదలుపెట్టిన కాలేజీని కొండగల్‌కు తరలించారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ తప్పులు బయపపెడ్తామన్నారు.