calender_icon.png 28 September, 2024 | 2:59 AM

ఆటోలో బాలికతో అసభ్య ప్రవర్తన

28-09-2024 01:01:23 AM

యువకులకు దేహశుద్ధి

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): మైనర్ బాలికను బల వంతంగా ఆటోలో ఎక్కించుకున్న ఇ ద్దరు యువకులు ఆమెతో అసభ్యం గా ప్రవర్తించారు. స్థానికులు గమనిం చి వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీపురం గ్రామ శివారు లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.

జిల్లా కేంద్రానికి చెందిన ఓ మైనర్ బాలిక పాఠశాల నుంచి ఇం టికి వెళ్తున్న క్రమంలో నాగనూలు గ్రామానికి చెందిన ఇద్దరు యువకు లు అటకాయించి బలవంతంగా ఆ టోలో ఎక్కించుకుని అసభ్యంగా ప్ర వర్తించారు. ఆటోవెనకాలే వెళ్తున్న వాహనదారులు గమనించి ఆటోను ఆపి ఇద్దరు యువకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.