నిందితుడిపై కత్తితో దాడిచేసిన బాధితురాలి సోదరుడు
ఎల్బీనగర్, ఆగస్టు 3: మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై బాధితురాలు సోదరుడు కత్తితో దాడి చేసిన ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్‌నగర్ కాలనీకి చెందిన ఓ మహిళతో శుక్రవారం రాత్రి ఇదే ప్రాంతానికి చెందిన హన్మంతు అసభ్యకరంగా ప్రవర్తించాడు. గమనించిన బాధితురాలి కుటుంబ సభ్యులు హన్మంతును నిలదీశారు. ఇదే సమయంలో బాధితురాలి సోదరుడు దేవరాజ్ అక్కడికి వచ్చి కూరగాయలు కోసే కత్తితో హన్మంతుపై దాడి చేశాడు. ఘటనలో హన్మంతుకు తీవ్ర గాయాల య్యాయి. ఇరువర్గాలపై ఎల్బీనగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు.