నల్లగొండ, డిసెంబర్ 31 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ నీటిపారుదల కార్యనిర్వహక ఇంజినీర్ (ఈఈ) లక్ష్మణ్‌బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాద్‌లోని జలసౌధాలో మంగళవారం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్లగొండ నీటిపారుదల చీఫ్ ఇంజినీర్ అజయ్‌కుమార్ ఈఈ లక్ష్మణ్‌బాబు పనితీరుపై మంత్రికి ఫిర్యాదు చేశారు. స్థానికంగా అందుబాబులో ఉండకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని మంత్రికి తెలిపారు.
స్పందించిన మంత్రి.. లక్ష్మణ్‌బా బుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.