calender_icon.png 30 September, 2024 | 4:54 AM

మిర్యాలగూడ హస్తంలో ఆధిపత్య పోరు!

30-09-2024 01:07:56 AM

  1. ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ చైర్మన్
  2. పట్టణంపై పట్టుకోసం ఇరునేతల పావులు
  3. రెండువర్గాలుగా చీలిన కౌన్సిలర్లు, క్యాడర్ 

నల్లగొండ, సెప్టెంబర్ 29 (విజయక్రాం తి): నల్లగొండ జిల్లాలో అత్యంత కీలక ని యోజకవర్గంగా పేరున్న మిర్యాలగూడలో అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నివురుగప్పిన నిప్పులా మారింది. పట్టణంలో పట్టు నిలుపుకునేందుకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ఎ వరికి వారే తమదైన శైలిలో ప్రయత్నిస్తుండటంతో పార్టీ క్యాడర్ రెండు వర్గాలుగా చీలి నట్లు చర్చ నడుస్తోంది.

గతంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న కాంగ్రెస్ నేత బత్తుల ల క్ష్మారెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సీటు కేటాయించడంతో ఘన విజయం సాధించా రు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ అధికారం కోల్పోవడం.. ఆ పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడ ంతో పదవిని కాపాడుకునేందుకు తనవర్గం కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ సైతం పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

రచ్చకెక్కుతున్న విభేదాలు 

ఆగస్టు 15న మిర్యాలగూడ ఎన్నెస్పీ క్యాం పు ఆవరణలో 100 అడుగుల జాతీయ జెం డాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎ ంపీ రఘువీర్‌రెడ్డి, నాగార్జున సాగర్, చెన్నూ రు ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. వేదికపైకి మున్సి పల్ చైర్మన్ భార్గవ్ రాకుండా పథకం ప్రకారమే ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పోలీసులు అడ్డుకోవడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

ఆయన అక్కడ లేక పోవడాన్ని నిర్ధారించుకున్న తరువాతే వైదికపైకి పిలిచినట్లు ప్రచారం జరిగింది. ఇటీవల పట్టణంలోని వైజంక్షన్లలో రూ.180 కోట్లతో నాలుగు చోట్ల ఫ్లుఓవర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరుకాగా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లె క్సీల్లో ప్రొటోకాల్ ప్రకారం మున్సిపల్ చైర్మ న్ ఫొటో పెట్టలేదని స్థానికంగా చర్చ సాగిం ది.

ఇటీవల మున్సిపల్ చైర్మన్‌కు సమాచా రం ఇవ్వకుండానే సబ్ కలెక్టర్‌తో కలిసి ఎ మ్మెల్యే మున్సిపల్ అధికారులు,  సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. రెండు రోజు ల క్రితం మున్సిపల్ చైర్మన్ అధ్యక్షత జరిగిన సాధారణ సమావేశంలో పలు అంశాలపై విభేదిస్తూ ఎమ్మెల్యే వర్గం కౌన్సిలర్లు సమావేశాన్ని వాకౌట్ చేసి వెళ్లిపోయారు. 

చైర్మన్ చేరిక నుంచే ఎమ్మెల్యే అసంతృప్తి

మున్పిపల్ చైర్మన్ భార్గవ్ కాంగ్రెస్‌లో చేరడాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వర్గం అప్పట్లోనే తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ రాజకీయ సమీకరణాలు, సంస్థాగతంగా ఆయనకున్న పట్టు దృష్ట్యా ఆ పార్టీ జిల్లా కీలక నేతలు అడ్డు చెప్పలేదు. నాటి నుంచే ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.

బీఆర్‌ఎస్ హయాంలో ఫ్లోర్ లీడర్‌గా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని పలు సందర్భాల్లో చైర్మన్ పదవిలో ఉన్న భార్గవ్ ఇబ్బందులకు గురి చేసినట్లు స్థానికంగా ప్రచారం జరిగింది. తీరా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీలో చేరడం చైర్మన్ పదవిని సైతం భార్గవ్ కాపాడుకోవడంతో సుధీర్ఘంగా కాంగ్రెస్‌లో పనిచేసిన కౌన్సిలర్లుకు, ఎమ్మెల్యేకు కంటగింపుగా మారింది.

దీంతో ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్‌ను రాజకీయంగా దెబ్బతిసేలా పార్టీ వ్యవహారాలు, అధికారిక కార్యక్రమాల్లో అన్ని తానై వ్యవహరిస్తున్నట్లు పట్టణంలో చర్చ నడుస్తున్నది.