calender_icon.png 7 February, 2025 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలిన మిరాజ్ యుద్ధ విమానం

07-02-2025 01:07:29 AM

భోపాల్, ఫిబ్రవరి 6: మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన రెండు సీట్ల మిరాజ్ యుద్ధ విమానం కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి ఎంక్వైరీకి ఆదేశించిన ట్లు భారత ఆర్మీ ఫోర్స్ ట్వీట్‌లో తెలిపింది.

సాధారణ శిక్షణ కార్యక్రమంలో భాగ ంగా శివపురి(గ్వాలియర్) సమీపంలో మిరాజ్ యుద్ధ విమానం కూలిపోయిందని పేర్కొంది. ప్రమాదంలో పైలట్లు ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారని తెలిపింది.