15-03-2025 11:59:08 AM
ద్విచక్ర వాహనాలతో ఫీట్లు
ఇతర వాహనదారులకు భయాందోళన
పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
రాజేంద్రనగర్: నిబంధనలకు విరుద్ధంగా మైనర్లు ద్విచక్ర వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. భయంకరంగా ఫీట్లు(Stunts) చేస్తూ తోటి వాహనదారులకు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు. శనివారం శివరాంపల్లి పి వీ ఎన్ ఆర్ ఎక్స్ ప్రెస్ వే(PVNR Expressway) పిల్లర్ నెంబర్ 276 వద్ద నుంచి డైరీ ఫామ్ వెళ్లే రూట్ లో మైనర్ బాలురు 4 వాహనాలతో ఫిట్లు చేశారు. అడ్డగోలుగా వాహనాలు నడపడంతో తోటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వీరి విన్యాసాలతో ఆందోళన చెందారు. సత్వరమే స్పందించి ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మైనర్లకు మరి తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దని నిబంధనలు ఉన్నా కూడా ఎక్కడ కూడా పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.