19-03-2025 12:00:00 AM
వరంగల్‌లో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు
హనుమకొండ, మార్చి 18 (విజయ క్రాంతి): వరంగల్‌లో బాలికలను వ్యభిచార కూపంలోకి దింపుతున్న ముఠాను మిల్స్ కాలనీ పోలీసులు మంగళవారం అరెస్టు చే శారు. వరంగల్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 11న మిల్స్ కాలనీ పరిధిలో బాలిక అదృశ్యమైంది. ఫి ర్యాదు రాగా పోలీసులు కేసు దర్యాప్తు ప్రా రంభించి, బాలికను ములుగు క్రాస్ రోడ్డు వద్ద గుర్తించారు.
బాలికను విచారించగా తన ను కొంతమంది కిడ్నాప్ చేసి, గంజాయి తా గించి అత్యాచారం చేశారని తెలిపింది. పోలీ సులు దామర మండలానికి చెందిన పడుపు వృత్తి చేసే మూసుకు లతను, మరో నిందితు రాలైన మైనర్‌ను అదుపులోకి తీసుకున్నా రు. మైనర్ నిందితురాలు సాయంతో లత బాలికను కిడ్నాప్ చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.
బాధిత బాలికతో ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు విచారణలో తేలిం ది. ఈ కిడ్నాప్ ప్లాన్‌లో మైనర్ నిందితురాలి ప్రియుడు అబ్దుల్ అప్నాన్ సా యంతో బాధిత బాలికకు గంజాయి అలవా టు చేసి తమ ట్రాప్‌లో పడేలా చేశారు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్ప డ్డారు.
అత్యాచారం చేసే సమయంలో వీడి యో రికార్డ్ చేశారని ఈ ఘటన గురించి ఎవ రికైనా చెప్పితే వీడియోలు బయటపెడతా మని బెదిరించినట్లు బాలిక పోలీసులకు తెలి పింది. నిందితులు ముసుకు లత, మైనర్‌తో పాటు అబ్దుల్ అప్నాన్, శైలాని బాబా, మహమ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజ్ బేగ్‌లను అరెస్టు చేశారు. మూసుకు లత ఇంటి వద్ద వేలకొద్దీ కండోమ్ ప్యాకెట్స్‌తో పాటు కారు, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.