calender_icon.png 31 January, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాత్రి షోలకు మైనర్లకు అనుమతి వద్దు

28-01-2025 01:45:35 AM

  1. రాత్రి 11 నుంచి ఉదయం 11 వరకు థియేటర్లలోకి ప్రవేశంపై ఆంక్షలు
  2. ఈ అంశంపై సర్కార్ నిర్ణయం తీసుకోవాలి
  3. హైకోర్టు కీలక ఉత్తర్వులు

హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాం తి): సమయపాలన లేకుండా సినిమా థియేటర్లల్లో షోలను ప్రదర్శించడం, వాటికి 16 ఏళ్లలోపు పిల్లలను అనుమతించడంపై హైకో ర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 16 ఏళ్లలోపు పిల్లలను సినిమాలకు అనుమతించరా దని థియేటర్ల యజమానులకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ విషయంపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని, అంతవరకు మైనర్లను ఆ వేళల్లో సినిమాలకు అనుమతించరా దని థియేటర్ల యజమానులకు ఆదేశాలిచ్చిం ది. గేమ్ ఛేంజర్ సినిమా టిక్కెట్ ధర పెంపు, అదనపు షోలకు ప్రభుత్వం అనుమతినివ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను సోమవారం జస్టిస్ బీ విజయసేనారెడ్డి విచారణ తర్వాత ఈ ఉత్తర్వులిచ్చారు.

పిటిషనర్ న్యాయవాది విజయ్ గోపాల్ వాదిస్తూ, ప్రభు త్వం బెనిఫిట్ షోలకు అనుమతించరాదని ఈ నెల 11న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందన్నారు. సినిమాటోగ్రఫీ రూల్స్ ప్రకారం ఉదయం 8.40లోపు, తెల్లవారు జామున 1.30 తర్వాత సిన్మాలను ప్రదర్శించరాదన్నారు. మల్టీప్లెక్స్‌లలో ఆఖరి షో తెల్లవారు 1.30 గంటలకు ఉంటుందన్నారు. మైనర్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

పుష్ప ప్రదర్శన సమయంలో జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించిన విషయాన్ని గుర్తుచేశారు. వాదనల తర్వాత హైకోర్టు, ప్రతివాదులైన హోంశాఖ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇతరులకు నోటీసులిచ్చింది. విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.