1967 తీర్పును తోసిపుచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ, నవంబర్ 8: అలీగఢ్ యూనివర్సిటీ (ఏఎంయూ) మైనార్టీ హోదా విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసుపై శుక్రవారం విచారణ జరిపిన ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం యూనిర్సిటీని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమంటూ 1967లో ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. కానీ వర్సిటీకి మైనార్టీ హోదా ఉండాలా? వద్దా? అనే విషయాన్ని తేల్చేందుకు ఈ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్టు పేర్కొంది.
1875లో మహ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీగా ప్రారంభమై 1920లో యూనివర్సిటీగా మారింది. 1967లో అజీజ్ భాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా అప్పటి రాజ్యాంగ ధర్మాసనం అలీగఢ్ వర్సిటీని కేంద్ర వర్సిటీగా పేర్కొంటూ తీర్పు చెప్పింది. అయితే 1981లో ఏఎంయూ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించడంతో వర్సిటీకి మళ్లీ మైనార్టీ హోదా దక్కింది. కానీ 1981 చట్ట సవరణను అలహాబాద్ హైకోర్టు 2006లో కొట్టేసింది. అంతేకాకుండా అలీగఢ్ వర్సిటీ మైనార్టీ విద్యా సంస్థ కాదని తేల్చి చెప్పింది.