calender_icon.png 28 February, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగికి మైనార్టీల సన్మానం

28-02-2025 07:57:58 PM

కాటారం (విజయక్రాంతి): కాటారం మండలంలోని ఎంపీడీవో ఆఫీసులో సబార్డినేట్ గా పనిచేసున్న హుస్సేన్ ఖాన్ పదవీ విరమణ పొందిన సందర్భంగా మండలంలోని మైనార్టీలు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగపరంగా అధికారులకు, ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి చేసిన సేవలను కొనియాడారు. పదవి విరమణ అనంతరం ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో గారేపల్లి మజీద్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ కాటారం మండల మైనార్టీ అధ్యక్షుడు షేక్ అమీర్, ఇమామ్ సిద్దిక్ బేగ్, మహమ్మద్ అబ్బాస్, ఖలీల్, ఇస్మాయిల్, ఇంతియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.