- టీ ప్రైమ్ స్కీంపై సీఎం స్పందించాలి
- టెక్‌టీప్ డైరెక్టర్ రియాజ్ ఖాద్రీ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10 (విజయక్రాంతి): మైనార్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ ప్రమోషన్(టెక్‌టీప్) వ్యవస్థాపక డైరెక్టర్ అబూ ఫతేసయ్యద్ బందగీ బాషా రియాజ్ ఖాద్రీ డిమాండ్ చేశా రు. ఎస్సీ, ఎస్టీ, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే టీప్రైమ్ పథకం అమలుపై మైనార్టీ సంక్షేమ దినోత్సవంలోనైనా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
ఆరేండ్ల క్రితం ప్రకటించిన టీప్రైమ్ స్కీమ్ జీవోకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల మాదిరిగానే మైనార్టీలకు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవకా శాలు కల్పించేం దుకు గత ప్రభుత్వం 2018, మార్చి 3న జీవో 16ను తీసుకొచ్చిందన్నారు.
ఆ తర్వాత బడ్జెట్‌లో రూ.25 కోట్లు కూడా కేటాయించా రన్నారు. కానీ గత ప్రభుత్వం ఈ జీవోను అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింల జీవన స్థితిగతులు దళితుల కంటే అధ్వాన్నంగా ఉన్నాయని సచార్, రంగనాథ్ మిశ్రా కమిటీ సిఫార్సులు ఈ విషయాన్ని స్పష్టం చేశాయన్నారు.