calender_icon.png 28 November, 2024 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైనూర్ నివేదికపై మైనార్టీ కమిషన్ అసంతృప్తి

24-09-2024 02:06:38 AM

పునర్విచారణకు ఆసిఫాబాద్ కలెక్టర్, ఎస్పీకి ఆదేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 23(విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్‌లో ఈ నెల మొదటివారంలో జరిగిన ఘర్షణపై ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇచ్చిన నివేదికపై తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కమిషన్ సోమవా రం అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారులు కమిషన్‌కు సమర్పించిన నివేదిక లు సవివరంగా లేవని పేర్కొంది. పలువురి నుంచి వచ్చిన వినతులు, ఫిర్యా దులతో అధికారులు ఇచ్చిన నివేదిక సరిపోలడం లేదని కమిషన్ చైర్మన్ తారీఖ్ అన్సారీ పేర్కొన్నారు.

కలెక్టర్, ఎస్పీ ఈ ఘటనలో జరిగిన నష్టాన్ని పునఃపరిశీలించాలన్నారు ఘర్షణ సమయంలో జరిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేయడం కోసం కమిటీని ఏర్పాటు చేశామని ఆసిఫాబాబద్ ఎస్పీ కమిషన్‌కు పంపిన నివేదికలో చెప్పగా.. ఆ కమిటీ నివేదికను తమకు పంపాలని అన్సారీ ఆదేశించారు. కలెక్టర్, ఎస్పీ నివేదికలు అందిన వెంటనే అవసరమైన సాయం కోసం కమిషన్ ప్రభుత్వాన్ని సంప్రదిస్తుందన్నారు. ఘటనలో ఉపాధి కోల్పోయిన మైనార్టీలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు పేర్కొన్నారు.