calender_icon.png 1 January, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారాయణ కాలేజీలో మైనర్ బాలికపై లైంగిక దాడి

02-10-2024 05:12:50 PM

ఏసీ టెక్నీషియన్ 

దాడి చేసినట్లు విద్యార్థి సంఘాల ఆందోళన 

శేరిలింగంపల్లి, (విజయక్రాంతి): ప్రైవేట్ కాలేజీల ధనదాహానికి విద్యార్థుల మాన,ప్రాణాలకు రక్షణలేని నిలయాలుగా తయారయ్యాయి. కేవలం ధనార్జనే పరమావధిగా భావిస్తున్నాయి. నిన్న మాదాపూర్ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్ ఘటనుంచి తెరుకోకముందే అదే మాదాపూర్ నారాయణ కాలేజీలో మరో దారుణం జరిగింది. ఇది మరీ దారుణంగా ఏకంగా కాలేజీ లో చదువుతున్న ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది.

మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ నారాయణ కాలేజీ ఐఐటీ అకాడమీ సింధు క్యాంపస్ లో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై ఏసీ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ లైంగిక దాడికి పాల్పడినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ బుధవారం నారాయణ కాలేజీ క్యాంపస్ ఎదుట ఆందోళనకు చేపట్టారు.రెండు రోజుల క్రితం అమ్మాయిపై లైంగికదాడి జరిగినా విషయం బయటకు పొక్కనీయకుండ కాలేజీ మేనేజ్మెంట్ విద్యార్థిని తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ చేసి బాలికను ఇంటికి పంపినట్లు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.అయితే మా క్యాంపస్ లో అలాంటి ఘటనలు ఏమీ జరగనట్టు కాలేజీ మేనేజ్మెంట్ బుకాయిస్తున్నారు. దీంతో విద్యార్థి సంఘాలు కాలేజీ ఎదుట ఆందోళన చేశారు. నారాయణ కాలేజీ  యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.సీఎం రేవంత్ రెడ్డి,మహిళా కమిషన్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.