calender_icon.png 25 November, 2024 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవ తరగతి చదివే బాలికపై అత్యాచారం

29-10-2024 04:21:28 PM

ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన

నిందితులలో ఒకరు మైనర్..

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఇద్దరు యువకులు, ఒక మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడినట్టు బాలిక తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రతినిత్యం వహిస్తున్న హుస్నాబాద్ పట్టణంలోని నేతాజీ నగర్ లో  ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 27 ఆదివారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటున్న పదవ తరగతి చదువుతున్న బాలికను సమీపంలోని కస్తూర్బా గాంధి బాలికల పాఠశాల భవనం వెనక ఉన్న గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. యువకులు ఇదే గ్రామానికి చెందిన ప్రభాస్, శేఖర్, భారత్ గా ఫిర్యాదులో పేర్కొంది. బాలిక తల్లి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ముగ్గురిలో ఒకరు మైనర్ బాలుడని  పోలీసులు గుర్తించారు.