05-04-2025 12:00:00 AM
బాత్‌రూం వద్ద వీడియోలు తీసిన నిందితుడు
సికింద్రాబాద్ పోలీసులకు ఫిర్యాదు, పోక్సో కేసు నమోదు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4(విజయక్రాంతి) : ఒడిషాకు చెందిన ఓ కుటుంబం రక్సెల్ వస్తుండగా వారిలోని ఓ మైనర్ బాలిక(16)కు చేదు అనుభవం ఎదురైంది. ఆమెపై ఓ వ్యక్తి లైం గిక వేదింపులకు పాల్పడ్డాడు. ఆ బాలికను లైంగికంగా వేదించిన వ్యక్తిపై సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. తెల్లవారు జామున 2గంటలకు కేల్జార్ రైల్వే స్టేషన్ సమీపంలో సదరు బాలిక రైలు బోగీలోని బాత్‌రూంకు వెళ్లింది. ఆమె ఒంటరిగా వెళ్లడంతో ఓ వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియోలు తీస్తూ, లైంగికంగా వేదించాడు.
దీంతో అతని నుంచి తప్పించుకున్న బాలిక వెళ్లి తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. ఆమె కుటుంబ సభ్యులు అతన్ని నిలదీయగా అతని సెల్‌ఫోన్‌లో వీడియోలు బయట పడ్డాయి. ఈ ఘటనపై రైల్వే టోల్ ఫ్రీ నంబర్ 139కు బాధితురాలి కుంటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. సికింద్రా బాద్ రైల్వే పోలీసులకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.