calender_icon.png 17 March, 2025 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాటారంలో మైనర్ బాలిక కిడ్నాప్

08-03-2025 10:51:44 PM

కాటారం (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో మైనర్ బాలికను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు ఎస్సై అభినవ్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ ఘటన జరగడం పట్ల పలువురు నేటిజన్ లు సోషల్ మీడియాలో తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఎస్ఐ కథనం ప్రకారం... కాటారం మండల కేంద్రంలోని 17 ఏళ్ల మైనర్ బాలికను గుర్తుతెలియని యువకులు తీసుకెళ్లారు. కారులో ఇద్దరు యువకులు బాలిక ఇంటి వద్దకు వచ్చి ఫోన్ చేసి బయటికి రప్పించి కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నట్లు ఎస్సై అభినవ్ వెల్లడించారు. బాలిక జాడ కోసం పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.