calender_icon.png 27 December, 2024 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికిత్స పొందుతున్న మైనర్ బాలిక మృతి

24-10-2024 03:59:25 PM

సీడ్ వ్యాపారిపై చర్యలు తీసుకుని హత్య కేసును నమోదు చేయాలి 

గద్వాల,(విజయక్రాంతి):  గత కొంత కాలంగా వెట్టిచాకిరి చేయించుకుని దొంగతనం నేరం మోపడంతో ఓ మైనర్ బాలిక అవమానం భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గత పది రోజులుగా చావు బ్రతుకుల మధ్య పోరాడుతూ ఓ మైనర్ బాలిక కర్నూల్ ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పొందుతు గురువారం మధ్యాహ్నం 1.10 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

గత కొన్ని రోజుల క్రితం అక్రమంగా దొంగతనం కేసు మోపడం వల్ల పోలీసులు పోలీస్ స్టేషన్ కు  పిలిపించడంతో భయోందోళనకు గురై ఆత్మహత్యాయత్నంకు పాల్పడి మృతి చెందిది. చేయని నేరానికి రెండు నెలల క్రితం బంగారు పోయిందని చెప్పి మళ్లీ దొరికిందని చెప్పి ఇంటికి పంపించి పది రోజుల క్రితం మళ్లీ దొంగతనం జరిగింది అని చెప్పి అక్రమంగా కేసు మోపిన బండ్ల రాజశేఖర్ రెడ్డి పై వెంటనే చర్యలు తీసుకొని హత్య కేసు నమోదు చేయాలని  కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. అధికారం,  డబ్బు అండదండలతో చట్టం నుండి తప్పించుకుని తిరుగుతున్న ఇట్లాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.