19-04-2025 01:46:38 PM
- అప్రమత్తమైన పోలీసులు.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం అవగాహన సదస్సు నేపద్యంలో హాజరయ్యేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy), ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి శనివారం నాగర్ కర్నూల్ జిల్లాకు హెలికాప్టర్ ద్వారా హాజరయ్యారు. కలెక్టరేట్ వద్ద ఉన్న హెలిప్యాడ్ ప్రాంతంలో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. పరిసరాల్లో ఎండు గడ్డిపై నిప్పురవ్వ రాలడంతో మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలని ఆర్పారు. ఫైర్ సిబ్బంది లేకపోవడంతో ఇబ్బంది తలెత్తింది.