అబ్దుల్లాపూర్ మెట్,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ లో బ్యాంక్ కాలనీలో స్వల్పంగా భూమి కదిలినట్లైందని స్థానికులు వివరించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ బ్యాంక్ కాలనీలో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో స్వల్పంగా భూమి ఊగినట్లు అనిపించిందని తెలిపారు. అదేవిధంగా ఇంట్లో గిన్నెలు కదలినట్లు శబ్దం వచ్చిందని స్థానికులు పేర్కొన్నారు. దీంతో కొంతమంది భయాందోళనలకు గురై ఇంట్లో నుంచి బయటికి వచ్చామన్నారు. అలాగే మంచం మీద కూర్చున్న ఓ వ్యక్తికి వెనకాల నుంచి ఎవరో నెట్టినట్టు అనిపించిందని వెల్లడించారు.