calender_icon.png 16 January, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి పొంగులేటికి స్వల్ప ప్రమాదం

03-09-2024 03:50:36 AM

  1. వరద ప్రాంతాల్లో బైక్‌పై పర్యటిస్తుండగా గాయం 
  2. చికిత్స అనంతరం యథావిధిగా పర్యటన

ఖమ్మం, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): ఖమ్మంలో సోమవారం వరద ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై పర్యటిస్తూ రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. రెండు రోజుల పాటు ఖమ్మంలో కురిసిన భారీ వ ర్షాలకు నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ప్రజలు సర్వం కోల్పోయి, తీవ్రంగా నష్టపోయారు. పరిస్థితిని స్వయం గా పరిశీలించి, బాధితులకు భరోసా కల్పించేందుకు మంత్రి పొంగులేటి ఉదయం ౭ గంటల సమయంలో నాయుడుపేట, సాయిప్రభాత్‌నగర్, పెద్దతండా, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప ప్రాంతాలను సందర్శించి, వరద బాధితులను పరామర్శించారు. అనంతరం ఫోర్త్‌క్లాస్ ఎంప్లాయిస్ కాలనీలో బాధితుల ను పరామర్శించేందుకు బైక్‌పై వెళ్తున్న క్రమ ంలో గేర్ రాడ్ కాలికి తగలడంతో స్పల్పగాయమైంది. అనంతరం ప్రభుత్వ డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మంత్రి యథావిధిగా వరద ప్రాంతాల్లో పర్యటించారు.