21-04-2025 11:22:53 AM
హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ శాఖ సహకారంతో సోమవారం నుండి నిజామాబాద్‌లో మూడు రోజుల రైతు మహోత్సవం జరగనుంది. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ ఉత్సవాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao), ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారు. కాగా, నిజామాబాద్ జిల్లాలో రైతు మహోత్సవం(Rythu Mahotsavam) కార్యక్రమంలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. రైతు మహోత్సవం స్వాగత వేదిక కూలి పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి స్వాగత వేదిక కూలిపోయింది. దీంతో స్వాగత వేదిక కూలడంతో అక్కడ ఉన్న పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.
రైతు మహాత్సవంలో పాల్గొనేందుకు మంత్రులు హెలికాప్టర్ లో వెళ్లారు. రైతు మహాత్సవంలో పాల్గొనేందుకు మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు వెళ్లారు. నిజామాబాద్ రైతు మహాత్సవంలో పంట ఉత్పత్తుల ప్రదర్శన జరుగుతోంది. పంట ఉత్పత్తుల ప్రదర్శనకు 150 స్టాళ్లు ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు, వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, మత్స్య శాఖల శాస్త్రవేత్తలు, సంబంధిత రంగాల అధికారులతో కలిసి వినూత్న వ్యవసాయ పద్ధతులపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. ఈ ఉత్సవం ప్రముఖ ప్రగతిశీల రైతులు, రైతు ఉత్పత్తి సంస్థలు తమ అంతర్దృష్టులను, అనుభవాలను పంచుకోవడానికి ఒక వేదికగా కూడా ఉపయోగపడుతుంది.