calender_icon.png 3 January, 2025 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యెమెన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష.. స్పందించిన విదేశీ వ్యవహారాల శాఖ

31-12-2024 11:07:46 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): యెమెన్ లో భారతీయ నర్సుకు మరణశిక్షపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(Ministry of External Affairs of India) మంగళవారం స్పందించింది. 2017లో జరిగిన యెమెన్ జాతీయుడి హత్య కేసులో కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియ నిందితురాలిగా ఉంది. అయితే యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి(Yemen President Rashad Al-Alimi) ఆమెకు నెల రోజులలోపు మరణశిక్ష అమలు చేసే అవకావం ఉన్నట్లు సమాచారం ఉందని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్(External Affairs Ministry Spokesperson Randhir Jaiswal) పేర్కొన్నారు. నర్సు ప్రియ ఆ శిక్ష నుంచి తప్పించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రియ కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని  రణ్ ధీర్ జైశ్వాల్ వెల్లడించారు.