calender_icon.png 2 November, 2024 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి

15-08-2024 12:12:39 AM

  1. బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ 
  2. అంబేద్కర్ విగ్రహానికి వినతి

మంచిర్యాల, ఆగస్టు 14 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రాల్లో బీసీ మంత్రిత్వ శాఖ ఉన్నట్లు కేంద్రంలోనూ బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. బీసీల డిమాండ్ల పరిష్కారానికి, బీసీలను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయడానికి, బీసీ హక్కుల పరిరక్షణకు తోడ్పాటును అందించాలని కోరారు.

కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడంతో బీసీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, నాయకులు శ్రీపతి రాములు, శాఖపురి భీంసేన్, కట్కూరి శ్రీనివాస్, అంకం సతీష్, తన్నీరు భీంరావు తదితరులు పాల్గొన్నారు.