22-03-2025 06:59:39 PM
ఐఎన్టియుసి నాయకులు..
కొత్తగూడెం (విజయక్రాంతి): కాంగ్రెస్ అధి నాయకత్వం ఇచ్చిన హామీ ప్రకారం అసెంబ్లీలో బీసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించడం హర్షదాయకం అన్నారు. శనివారం కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్ నందు ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్, జనక్ ప్రసాద్ ఆదేశానుసారం, కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, మంత్రుల ఫోటోలకు పాలాభిషేకం చేసారు. వైస్ ప్రెసిడెంట్ ఎండి, రజాక్ మాట్లాడుతూ... కాంగ్రెస్ కేంద్ర నాయకులు, రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఇచ్చిన, బీసీ, ఎస్సీ వర్గీకరణ, బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చినట్టు అయ్యిందన్నారు. కొత్తగూడెం ఏరియా ఉద్యోగుల తరపున తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ, నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు.